మెదక్‌లో ‘కోత’లను నిరసిస్తూ సబ్‌స్టేషన్ ముట్టడి
మెదక్, మార్చి 22 : అప్రకటిత విద్యుత్ కోతలను నిరసిస్తూ మెదక్ జిల్లా రేగోడు మండలం కోత్వాన్‌పల్లి రైతులు సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ వేళాపాలా లేని విద్యుత్ కోతల వల్ల చేతికందే దశలో ఉన్న పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. లక్షలాది రూపాయలు పెట్టుబడులు పెట్టి సాగుచేసిన పంటలు కళ్లముందే ఎండిపోతుండడానికి కరెంటు కోతలు, లోవోల్టేజీ సమస్యలే కారణమని ఆరోపించారు. ఇప్పటికైనా విద్యుత్ అధికారులు స్పందించి కోతలను నివారించి సక్రమంగా కరెంటు ఇవ్వాలని డిమాండ్ చేశారు.