మెదక్‌లో తెలంగాణవాదుల ముందస్తు అరెస్టు

మెదక్‌,(జనంసాక్షి): జిల్లా పోలీసులు ఓవర్‌ యాక్షన్‌ చేశారు. తెలంగాణలో సీమాంధ్ర నేత పర్యటన సందర్భంగా పలువురు తెలంగాణ వాదులను ముందస్తుగా అరెస్టు చేశారు. ఇవాళ జోగిపేటలో వైఎస్సార్సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ పర్యటిస్తున్న సందర్భంగా టీఆర్‌ఎస్‌ శ్రేణులు, ఇతర తెలంగాణ వాదులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.