మెదక్‌ కాంగ్రెస్‌ నేతలతో డిప్యూటీ సీఎం భేటీ

మెదక్‌,(జనంసాక్షి): మెదక్‌ జిల్లా కాంగ్రెస్‌ నేతలతో డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ భేటీ అయ్యారు. 30న నిజాం కాలేజీ గ్రౌండ్‌లో నిర్వహించబోయే సభకు జన సమీకరణపై చర్చ జరుపుతున్నారు. అయితే ఈ సమావేశానికి పార్టీ ఎమ్మెల్యే విప్‌ జగ్గారెడ్డిని దామోదర ఆహ్వానించక పోవడం చర్చనీయాంశమైంది.