మెదక్‌ జిల్లాలో మహిళ ఆత్మహత్య

 మెదక్‌, ఆగస్టు 20 : పాపన్నపేట మండలం కుర్తివాడలో లావణ్య అనే మహిళ ఆత్మహత్య చేసుకుంది. దీంతో మృతురాలి భర్త, అత్త, మామ పరారయ్యారు. లావణ్య ఆత్మహత్యకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవడంలో పోలీసులు స్పందించడం లేదని జిల్లా ఎస్పీకి మృతురాలి కూతురు ఫిర్యాదు చేశారు.