మెదక్‌ జిల్లాలో లాకప్‌ డెత్‌

 మెదక్‌ : ఓ  హత్య కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తిని పోలీసులు చిత్రహింసలకు గురిచేయడంతో ఆయన చనిపోయాడు. మృతదేహాన్ని గుట్టుచప్పుడు కాకుండా ఆస్పత్రికి తరలించి చేతులు దులుపుకున్నారు. మెదక్‌ జిల్లా పుల్కల్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఈ ఘటన చోచుసుకుంది. జిల్లాలోని పుల్కల్‌ మండలం పెద్దారెడ్డిపేటలో ఇటీవల జరిగిన మహిళ హత్యకేసులో సదాశివపేట మండలం ఎల్లారం గ్రామానికి చెందిన లక్ష్మణ్‌ నిందితుడు. అతడిని అరెస్ట్‌ చేసిన పోలీసులు మూడురోజులుగా చిత్రహింసలకు గురిచేశారు. తట్టుకోలేని లక్ష్మణ్‌ తీవ్ర గాయాలతో బాధపడుతూ మృతి చెందాడు. అయితే పోలీసులు లక్ష్మణ్‌ మృతదేహాన్ని గుట్టుచప్పుడు కాకుండా గాంధీ ఆస్పత్రికి తరలించారు. పోలీసుల తీరుపై విమర్శలు వినిపిస్తున్నాయి.