మెదక్…టు..అమలాపురం
బస్సు సర్వీసు ప్రారంభం
మెదక్‌అర్బన్:మెదక్ ఆర్టీసీ డిపో అధ్వర్యంలో పట్టణం నుంచి అమలాపురానికి సూపర్ లగ్జరీ బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు.సోమవారం స్థానిక డిపో గ్యారేజిలో డీఎం ఎంఎన్‌బి రాజు బస్సు సర్వీసును ప్రారంభించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రతిరోజు మెదక్ పట్టణం నుంచి సాయంత్రం ఐదుగంటలకు అమల పురానికి బస్సు బయల్దేరుతుందన్నారు.నర్సాపూర్,హైదరాబాద్,కోదాడ, విజయవాడ,ఏలూరు,రావులపాలెం గుండా అమలపురానికి వెళ్తుందన్నారు.టిక్కిట్ ధర రూ.562గా నిర్ణయించామన్నారు.