మెదక్, వరంగల్ జిల్లాల్లో పత్తి రైతుల ఆందోళన
మెదక్, వరంగల్: పత్తికి మద్దతు ధర చెల్లించాలంటూ మెదక్, వరంగల్ జిల్లాల్లో పత్తి రైతులు ఆందోళనకు ఉపక్రమించారు. గజ్వేల్ మార్కెట్ యార్డులో పత్తిని తగలబెట్టి రైతులు ఆందోళనకు దిగారు. సీసీఐ నిబంధనలను వ్యతిరేకిస్తూ ఎనుమాముల మార్కెట్ యార్డులో పత్తి రైతులు ఆందోళన చేపట్టారు. పత్తిని మద్దతు ధరకు కొనుగోలు చేయాలని అధికారులతో రైతులు వాగ్వాదానికి దిగారు.