మెదక్: అమరవీరుల కుటుంబాలకు చెక్కులు
సంగారెడ్డి (మార్చి05): ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ఆత్మార్పణ చేసిన పలువురు అమరుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం చెక్కులు అందజేసింది. గురువారం నాడు సంగారెడ్డి కలెక్టరేట్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు ఈ చెక్కులు అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో అమరుల త్యాగం వెలకట్టలేనిదని ప్రశంసించారు. అమరవీరులందరి కుటుంబాలకూ పరిహారం ఇస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి పాల్గొన్నారు.