మెదక్: ఒంటెల పట్టివేత
పోలీసుల అదుపులో 56 ఒంటెలు, 10మంది వ్యక్తులు
మనూరు: అక్రమంగా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్న ఒంటెలను శనివారం మనూరు సమీపంలో పోలీసులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఖేడ్ సీఐ సైదానాయక్ మాట్లాడారు. ఎలాంటి అనుమతి లేకుండా రాజస్థాన్ నుండి హైదరాబాద్ ప్రాంతానికి తరలిస్తున్నారని వచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. 56 ఒంటెలు, 10మందిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. ఈయన వెంట ఎస్‌ఐ ఏడుకొండలు ఉన్నారు.