మెదక్ కలెక్టరేట్ లో అంతర్జాతీయ ఆహార దినోత్సవం
మెదక్ ప్రతినిధి,(జనంసాక్షి):అంతర్జా తీయ ఆహార దినోత్సవం సందర్భంగా శుక్రవారం కలెక్టరేట్ లోని ప్రజావాణిలో పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ గతంలో సరైన వర్షాలు లేక పంటలు పండక ఆకలి చావులు చూశామని, ఇకముందు ఆకలి చావుల దుస్థితి రాకుండదనే ఉద్దేశ్యంతో ఈ రోజు ప్రపంచ ఆహార దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని అన్నారు. ఆకాలిచావుల నివారణకు మన దేశంలో జాతీయ ఆహార భద్రత చట్టం 2013 ను అమలు చేస్తూ చౌక ధరల దుకాణాల ద్వారా రేషన్ కార్డుదారులకు, అంగన్వాడీ కేంద్రాలకు పాఠశాలలో మధ్యాన్నం బోజనానికి బియ్యం సరఫరా చేస్తున్నామన్నారు. జిల్లాలో 2 లక్షల 13 వేల రేషన్ కార్డు దారులకు ప్రతినెలా బియ్యం అందజేస్తున్నామన్నారు. రక్తహీనతతో ఆడపిల్లలు బాధపడుతున్నారని, ప్రతి ఒక్కరు సమతుల్యమైన, నాణ్యమైన పౌష్టికాహారాన్ని తీసుకోవాలని అప్పుడే ఆరోగమైన సమాజాన్ని నిర్మించిన వారమవుతామన్నారు. ప్రస్తుత పరిస్థితులలో ఆహార పదార్థాలు కలుషితమయ్యాయని, ఉన్నదాంట్లో నాణ్యమైన ఆహారపు అలవాట్లు చేసుకోవాలన్నరు. జంక్ ఫుడ్ తినవద్దని, సేంద్రీయ వ్యవసాయ పద్దతిలో పండించిన ఆకు కూరలు, కాయగూరలు, ఆహార ధాన్యాలు, పండ్లు తీసుకోవాలని సూచించారు. నేటి బాలలే రేపటి పౌరులని అంగన్వాడీ కేంద్రాల ద్వారా పిల్లలకు, వసతి గృహాల ద్వారా విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలన్నారు. అందరికి ఆహార భద్రత కల్పించాలన్నదే ఆహార భద్రత కమీషన్ లక్ష్యమని, చట్టం ద్వారా హక్కులు కూడా కల్పించిందని, ఆహారం అందకపోతే జిల్లా గ్రీవెన్సెస్ రిడ్రెస్సల్ అధికారైనా జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారికి ఫిర్యాదు చేస్తే విచారణ జరిపి తగు చర్య తీసుకుంటామన్నారు. న్యూట్రిషన్ గార్డెన్ ల పై పిల్లలకు అవగాహన కలిగించాలని డీఈఓ కు సూచించారు.
డిఆర్డిఓ శ్రీనివాస్ మాట్లాడుతూ సరైన ఆహారం, సరైన వ్యక్తికీ సరైన సమయంలో అందుతున్నాదా చూడడమే ఆహార భద్రత కమీషన్ ధ్యాయమని అన్నారు. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న ప్రతి ఒక్క కుటుంబం ఆహార భద్రత పొందే హక్కు ఉందని అన్నారు. ప్రజలలో అవగాహన లేక కృత్రిమ ఆహార కొరత సృష్టిస్తూ హక్కులకు భంగం కలిగినప్పుడు వెంటనే అధికారులకు తెలపాలని సూచించారు.
జిల్లా పౌర సరఫరాల అధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి మనిషి ఆరోగ్యవంతంగా ఉండాలంటే ఆహారంతో పాటు, గాలి, నీరు ఎంతో అవసరమని అన్నారు. ప్రభుత్వాలు కూడా ఆహారం, ఆరోగ్య విషయంలో ప్రత్యేక చొరవ తీసుకొని అనేక కార్యక్రమాలు చేపడుతున్నదని అన్నారు. జిల్లాలో షెల్టర్ హోమ్ లు ఏర్పాటు చేసి ఆహారాజాని అందిస్తున్నామన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర స్థాయిలో జరిగిన వ్యాసరచన పోటీలలో 104 మంది, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ 4, పోస్టర్లు 41, 3 నుండి 6 నిముషాల నిడివి గల షార్ట్ వీడియోలు 7 ఈ జిల్లా నుండి పంపారు. ఇందులో పాల్గొన్న విద్యార్థులకు, అంగన్వాడీ కార్యకర్తలకు జ్ఞాపికలను అదనపు కలెక్టర్ రమేష్ అందజేశారు.
ఈ కార్యక్రమంలో డీఈఓ రమేష్ కుమార్, డిఎమ్ అండ్ హెచ్ ఓ విజయ నిర్మల, జిల్లా సైన్స్ అధికారి రాజి రెడ్డి, సెక్టోరల్ అధికారి సూర్యప్రకాష్, డి.డబ్ల్యూ.ఓ. బ్రహ్మాజీ, జిల్లా వినియోగదారులు ఫోరమ్ అధ్యక్షులు వెంకటేష్, అం కాణ్వాది టీచర్లు తదితరులు పాల్గొన్నారు