మెదక్: కోతుల దాడిలో వ్యక్తికి గాయాలు.
నర్సాపూర్: బైక్‌పై వెల్తున్న ఓ వ్యక్తిపై కోతులు అకస్మాత్తుగా దాడి చేయడంతో గాయాలకు గురైన ఘటన శనివారం జరిగింది. నర్సాపూర్‌కు చెందిన హుస్సేన్ అనే వ్యక్తి మండలంలోని మద్దూర్ గ్రామం నుంచి నర్సాపూర్‌కు వస్తుండగా స్థానిక సబ్‌స్టేషన్ వద్ద రోడ్డు పక్కన ఉన్న కోతులు బైక్‌పై దూకడంతో.. హుస్సేన్ కిందపడి గాయాలకు గురయ్యాడు. ఈమేరకు బాధితుడిని చికిత్స నిమిత్తం నర్సాపూర్ ఆసుపత్రికి తరలించారు.