మెదక్ : సిద్దిపేటలో ఏబీవీపీ ఆధ్వర్యంలో భిక్షాటన
మెదక్ , ఆగస్టు 18 : ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయాలంటూ మంగళవారం సిద్ధిపేటలో ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు భిక్షాటన చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘం నాయకులు మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయకుండా నిర్లక్ష్యం చేస్తోందని వారు విమర్శించారు