మెరుగైన వైద్య సేవలు అందించాలి.
జడ్పీ ఛైర్మన్ జనార్ధన్ రాథోడ్.
ఉట్నూర్.జనం సాక్షి
ఇంద్రవెళ్లి మండలంలోని మామిడి గూడ(బి)కి చెందిన గాంధారి బాయి కి సోమవారం నాడు పురిటి నొప్పుల రావడంతో గ్రామస్తులు అప్రమతం అయి ఆసుపత్రికి తరలించగా మార్గ మధ్యంలో మామిడిగూడ వాగు ఉద్రిక్త ప్రసవించడంతో వాగు ఒడ్డున ప్రసవించడం జరిగింది.ఫోన్లో పిట్టబొంగరం ఆసుపత్రిని సంప్రదించగా హెచ్ఈఓ మరియు ఆశా వర్కర్లు వెంటనే అక్కడికి చేరుకొని ఇంద్రవెళ్లి ఆసుపత్రికి తరలించడంతో తల్లి కూతురు క్షేమంగా ఉన్నారు.విషయం తెలుసుకున్న ఆదిలాబాద్ జడ్పీ ఛైర్మన్ జనార్ధన్ రాథోడ్ ఇంద్రవెళ్లి లోని ప్రభూత్వ ఆసుపత్రి కి వెళ్లి వివరాలు తెలుసుకున్నారు మరియు వారికి కెసిఆర్ కిట్ ను అందజేశారు.ఈ సందర్భంగా జడ్పీ ఛైర్మన్ మాట్లాడుతూ భారీ వర్షాల వల్ల తెలంగాణ ప్రభూత్వం ముందు జాగ్రత్తగా ఉట్నూర్ నందు స్పెషల్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.తెలంగాణ ప్రభూత్వం గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్ అన్ని ప్రభూత్వ ఆసుపత్రుల్లో మంచి నాణ్యమైన వైద్యం అందిస్తున్నారని ఎప్పటికప్పుడు రోగులకు మెరుగైన వైద్యాన్ని అందించాలని జడ్పీ ఛైర్మన్ ఆసుపత్రి డాక్టర్ మరియు సిబ్బందిని ఆదేశించారు.రాబోయే కాలంలో కూడా తెలంగాణ ప్రభూత్వం మరిన్ని మెరుగైన వైద్య సేవలు అందిస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో వారి వెంట జడ్పీ కో అప్షన్ సభ్యులు అంజద్ సూఫీయాన్ టీఆరెస్ రాథోడ్ ఉత్తమ్ తదితరులు ఉన్నారు.