మేడిగడ్డ ద్వారా సూర్యాపేట జిల్లాకు సాగునీరు
– రాష్ట్ర వ్యాప్తంగా 50లక్షల ఎకరాలకు సాగునీరందిస్తాం
– ప్రాజెక్టులకు కాంగ్రెస్ అడ్డుపడుతుంది
– రైతుబంధుతో సన్న, చిన్నకారు రైతులకు ఎంతో మేలు
– దేశంలో ఎక్కడాలేని విధంగా రైతుబంధు పథకం
– రైతుబంధుతో తెలంగాణలో ప్రతిపక్షాల అడ్రస్సు గల్లంతే
– దేశంమొత్తం తెలంగాణలో అభివృద్ధివైపుచూస్తుంది
– మంత్రి జగదీశ్ రెడ్డి
సూర్యాపేట,( జనం సాక్షి) : మేడిగడ్డ ప్రాజెక్టు ద్వారా సూర్యాపేట జిల్లాలోని 2.50 లక్షల ఎకరాలకు సాగు నీరు అందిస్తామని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి వెల్లడించారు. పెన్‌పహాడ్ మండలంలోని గాజుల మొలకాపురం, సింగిరెడ్డి పాలెం గ్రామాల్లో జరిగిన రైతుబంధు పథకంలో మంత్రి జగదీశ్‌రెడ్డి పాల్గొని ప్రసంగించారు. మేడిగడ్డ ప్రాజెక్టుతో తెలంగాణలో మొత్తం 50 లక్షల ఎకరాలకు సాగునీరు ఇస్తామన్నారు. ఇలాంటి ప్రాజెక్టుకు కాంగ్రెస్ అడ్డుపడుతుందని మంత్రి ధ్వజమెత్తారు. అప్పు లేకుండా రైతు వ్యవసాయం చేయాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని ఉద్ఘాటించారు. ఈ క్రమంలోనే పంట పెట్టుబడి సాయం అందిస్తున్నామని మంత్రి తెలిపారు. వ్యవసాయ రంగంలో సీఎం కేసీఆర్ దేశంలోనే చరిత్ర సృ ష్టించారని మంత్రి కొనియాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హావిూ మే రకు రైతుల రుణ బకాయిలను రూ. 17వేల కోట్లను మాఫీ చేశారని గుర్తుచేశారు. కరంట్ సమస్యను చక్కదిద్ది 24గంటలపాటు విద్యుత్ సరఫరా చేస్తున్నది దేశంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వమేని స్పష్టం చేశారు. రైతులను అప్పుల ఊబి నుంచి బయటపడేసేందుకే రైతుబంధు పథకానికి శ్రీకారం చుట్టారని, ఎకరాకు రూ.8వేల చొప్పున ఏడాదికి రూ. 12వేల కోట్లను అందిస్తూ దేశానికే ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. రాష్ట్రంలో ఎక్క డా నగదు కొ రత రాకుండా సీఎం కేసీఆర్ ముందుగానే రిజర్వుబ్యాంకు అధికారులతో మాట్లాడారని, దీంతో మొదటి సహాయంగా రూ.5వేల 32 కోట్లను రాష్ట్రంలోని అన్ని బ్యాంకుల్లో జమ చేశారని జగదీశ్వర్‌రెడ్డి వెల్లడించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జూన్ 2నుంచి రైతు బీమా పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టబోతున్నారని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. రైతు అనుకోకుండా ప్రమాద బారిన పడి చనిపోయినా, ఇతర కారణాలతో చనిపోయినా ఆ కుటుంబాన్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో రూ. 5లక్షల బీమా పథకాన్ని అమల్లోకి తీసువస్తున్నారని అన్నారు. రైతుల బాధలను పట్టించుకోని కాంగ్రెస్, బీజేపీలకు టీఆర్‌ఎస్ ప్ర భుత్వాన్ని విమర్శించే కనీస నైతిక హక్కే లేదని జగదీశ్వర్‌రెడ్డి ధ్వజమెత్తారు. కేంద్రంలో, పలు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ రైతులను పట్టించు కోవడంలేదని, స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేయడం లేదని విమర్శించారు. ఆ రెండు పార్టీలు రైతులపై కపట ప్రేమ ఒలకబోస్తున్నాయని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న గిట్టుబాటు ధర విషయాన్ని ఇప్పుడు అధికారంలో బీజేపీ ప్రభుత్వం, గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ పట్టించుకోలేదని ఆగ్ర హం వ్యక్తం చేశారు. ఇప్పుడు అధికారంలోకి వస్తే రూ.2లక్షల పంట రుణంమాఫీ చేస్తామనడం విడ్డూరంగా ఉందన్నారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఉత్తర ప్రగల్బాలు ఎన్ని పలికినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు.