*మేడిగూడ రోడ్ లో బాడిబాట.

జైనథ్ జనంసాక్షి : మండలంలోని మేడిగూడ రోడ్ గ్రామంలో జయశంకర్ బడిబాటలో భాగంగా   ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్తులతో కలిసి గ్రామంలో బడి ఈడు పిల్లల బడిలో చేయాలని ర్యాలీ  నిర్వహించారు*
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు సత్యవాన్ చిక్టే మాట్లాడుతూ తెలుగు మాధ్యమంతో 1 నుండి 8 వ తరగతి వరకు ఈ ఏడాది నుంచే ఆంగ్ల మాధ్యమం మొదలైందని, ఆసక్తి కలిగి విద్యార్థులు అడ్మిషన్ తీసుకోవాలి విజ్ఞప్తి చేశారు. మేడిగూడ రోడ్ పాఠశాల మన ఊరు- మన బడి కార్యక్రమానికి ఎంపికైందున అదనపు నిధులతో  విద్యార్థులు చదువుకోవడానికి సౌకర్యవంతంగా ఉండడానికి ఆధునిక అంగుళాలతో పాఠశాలను అభివృద్ధి చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా అన్నీ అర్హతలు, అనుభవం ఉన్న ఉపాధ్యాయులచే తెలుగుతో పాటు ఆంగ్లంతో విద్యా బోధన కొనసాగుతున్నదని, నాణ్యమైన బోధన ప్రభుత్వ పాఠశాలలలోనే ఉంటుందని పిల్లల  తల్లిదండ్రులకు  తెలియజేశారు. పాఠ్య పుస్తకాలు, రెండు జతల బడి దుస్తులు, మధ్యాహ్న భోజనంతో పాటు వారానికి మూడు గుండ్లు తదితర సౌకర్యాలను తెలంగాణ ప్రభుత్వం ద్వారా ఉచితంగా అందజేస్తామని చెప్పారు. నోట్ పుస్తకాలను కూడా ఉపాధ్యాయులు, దాతల సహకారంతో ఉచితంగా అందజేస్తామని తెలిపారు*
*బడి బాట కార్యక్రమంలో ఉపాధ్యాయురాళ్ళు మంజుష, జ్యోతి ఉపాధ్యాయులు నాందేవ్, సంతోష్, కృష్ణమూర్తి, దేవిదాస్ భావానీఆనంద్, పెంటపర్తి ఊశన్న, సావయి ప్రకాష్, కన్నం భూమయ్య, గ్రామస్తులు, విద్యార్థులు పాల్గొన్నారు.