మేడే సందర్భంగా ఆర్బీఐ ఉద్యోగుల ర్యాలీ

హైదరాబాద్‌, మేడే సందర్భంగా రిజర్వు బ్యాంక్‌ ఉద్యోగుల సంఘం నగరంలో ప్రదర్శన నిర్వహించింది. లక్డీకపూర్‌లోని ఆర్బీఐ నుంచి సైఫాబాద్‌లో ఎల్‌ఐసీ వరకు ర్యాలీ కొనసాగింది. కార్మికులు పనిదినాలు తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ కార్మికులు నినాదాలు చేశారు. చట్టాలు అమలు చేయడంతో కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని సంఘం నేతలు ఆరోపించారు.