మేడ్చల్ వద్ద రోడ్డు ప్రమాదం: ముగ్గురు యువకుల మృతి
మేడ్చల్: ద్విచక్ర వాహనాన్ని కారు ఢీ కొట్టడంతో ముగ్గురు యువకులు మృతి చెందిన సంఘటన రంగారెడ్డి జిల్లాలో శనివారం చోటుచేసుకుంది. మేడ్చల్ జాతీయ రహదారిపై ద్విచక్రవాహనంపై వెళ్తున్న ముగ్గురు యువకులను గుర్తు తెలియని కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో యువకుడు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యంలో మృతిచెందాడు. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.