మేధర వృత్తిదారులకు ప్రభుత్వం చేయూత ఇవ్వాలి.

 

కోన బాలాశేకర్ మేదర సంఘం రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు

రాజన్నసిరిసిల్ల. బ్యూరో. సెప్టెంబర్ 18, (జనం సాక్షి) మెదర వృత్తి ఆధారపడిన వారికి ప్రభుత్వం చేయూత ఇవ్వాలని రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు కోన బాల శేఖర్ అన్నారు. ఆదివారం ప్రపంచ వెదురు దినోత్సవాన్ని పురస్కరించుకొని అంబేద్కర్ చౌరస్తా వద్ద . వేడుకలను నిర్వహించారు. వెదురుతో తయారుచేసిన వస్తువులను ప్రదర్శించారు. ఈ సందర్భంగా కోణం బాల శేఖర్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం వెదురు వస్తువులు వినియోగించాలని కోరారు. కేవలం వెదురు పై ఆధారపడ్డ మేదరుల సంక్షేమం కోసం ప్రభుత్వం చేయూత అందించాలని కోరారు. కార్యక్రమంలో కోన శ్రీనివాస్, కనికరపు రాజన్న, పోతు బాలయ్య,, మల్లేశం, పుట్ట మల్లేశం దేవయ్య, స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు