మేనకా గాంధీ వర్సెస్ ప్రకాశ్ జవదేకర్

prakash-javadekar-maneka-gandhiకేంద్ర మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ పర్యావరణ అటవీశాఖ మంత్రిత్వ శాఖపై ఫైర్ అయ్యారు. జంతువును చంపడానికి పర్మిషన్ ఇచ్చారు కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్. ఇప్పటికే ఇద్దరి మధ్య వార్ నడుస్తోంది. తాజాగా ఇచ్చిన అనుమతితో  అభిప్రాయభేదాలు మరోసారి రచ్చకెక్కాయి.

కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ వివిధ రాష్ట్రాలలో జంతువులను చంపేయడానికి ఎందుకు అనుమతిచ్చారని మేనకా గాంధీ ప్రశ్నించారు. మంత్రి అనుమతితో కొన్ని అరుదైన జీవజాతులు అంతరించిపోయే అవకాశముందని ఆమె మండిపడ్డారు. ప్రజలు కోరితే ఏ జంతువునైనా చంపుకోవచ్చంటూ పర్యావరణశాఖ మంత్రి అనుమతి ఇవ్వడం సరైంది కాదన్నారు. పశ్చిమ బెంగాల్ లో ఏనుగులు, హిమాచల్ ప్రదేశ్ లో కోతులు, గోవాలో నెమళ్లను చంపేయడానికి అనుమతించిందని ఆమె తెలిపారు. ఇప్పటికే మహారాష్ట్రలోని చందన్ పూర్ లో 53 ఎలుగుబంట్లను చంపేశారని..మరో 50 ఎలుగు బంట్లను చంపేందుకు అనుమతిచ్చారని  ఆరోపించారు. అటవీ శాఖ జంతువుల రక్షణకు దోహదపడాలే కానీ.. ఇటువంటి చర్యలు ఏమాత్రం సమజసం కాదన్నారు మేనకా గాంధీ.

అయితే పర్యావరణశాఖ మంత్రి జవదేకర్ వాదన మాత్రం మరోలా ఉంది. చట్టపరిధికి లోబడే తాము ఈ నిర్ణయం తీసుకుమన్నారు. చట్టప్రకారం రైతులు ఇలాంటి జంతువుల వల్ల నష్టపోతున్నారని రాష్ట్రాలు కేంద్రానికి లేఖ రాస్తే, దానిపై 1972 చట్టానికి లోబడి ఓ నిర్ణయం తీసుకునే అధికారం తమకు ఉందని తెలిపారు జవదేకర్.