మేమున్నాం..

3

– వరద బాధితులకు రాహుల్‌ భóరోసా

చెన్నై,డిసెంబర్‌8(జనంసాక్షి): భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన తమిళనాడు తాము అండగా ఉంటామని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ భరోసా ఇచ్చారు. గత కొద్ది రోజులుగా కురిసిన భారీ వర్షాలకు తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల ప్రజలు  అతలాకుతలం కాగా ,వరద బాధితులను పరామర్శించేందుకు కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ  పుదుచ్చేరి చేరుకున్నారు. ఈ సందర్భంగా రాహుల్‌ గాంధీ విూడియాతో మాట్లాడుతూ.. వరదల ప్రభావాన్ని ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు తాను ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్నట్లు తెలిపారు. రాజకీయాలకు ఇది సమయం కాదని.. ప్రస్తుత పరిస్థితుల్లో వరద బాధితులకు అండగా నిలవాలన్నారు. ఆయన రాగానే పార్టీ కార్యకర్తలు, నేతలు ఆయనపై పువ్వులు చల్లారు.  పుదుచ్చేరిలో రోడిర్‌పేట్‌, రియాన్‌కుప్పం, క్రిమంబాకం తదితర ప్రాంతాల్లో పర్యటించిన అనంతరం రాహుల్‌ తమిళనాడులోని కడలూరు ప్రాంతంలో పర్యటించారు. ఇక్కడ ఏం జరిగిందో నా కళ్లతో స్వయంగా చూసేందుకు వచ్చాను. ఈ సమయంలో రాజకీయాలు చేయడం ముఖ్యంకాదు. ఈ సందర్బంగా పుదుచ్చేరి, తమిళనాడు ప్రజలు త్వరలోనే కోలుకుంటారనే భరోసా ఇవ్వాలి’ అని  రాహుల్‌ గాంధీ అన్నారు. మంగళవారం వరద బాధిత పుదుచ్చేరిని సందర్శించి అక్కడ ప్రజలకు భరోసా ఇచ్చేందుకు రాహుల్‌ గాంధీ వచ్చారు.  ఆయన వరద బాధితులకు కొన్ని రకాల వస్తువులను పంపిణీ చేశారు.

‘చూసేందుకు వచ్చాను.. రాజకీయాలకు కాదు’

‘ఇక్కడ ఏం జరిగిందో నా కళ్లతో స్వయంగా చూసేందుకు వచ్చాను. ఈ సమయంలో రాజకీయాలు చేయడం ముఖ్యంకాదు. ఈ సందర్బంగా పుదుచ్చేరి, తమిళనాడు ప్రజలు త్వరలోనే కోలుకుంటారనే భరోసా ఇవ్వాలి’ అని కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ అన్నారు. మంగళవారం వరద బాధిత పుదుచ్చేరిని సందర్శించి అక్కడ ప్రజలకు భరోసా ఇచ్చేందుకు రాహుల్‌ గాంధీ వచ్చారు.ఈ సందర్భంగా ఆయనకు పార్టీ కార్యకర్తలు పూలుజల్లుతూ ఘన స్వాగతం చెప్పారు. ఈ సందర్బంగా ఆయన వరద బాధితులకు కొన్ని రకాల వస్తువులను పంపిణీ చేశారు. అనంతరం కాసేపు విూడియాతో మాట్లాడారు. ఆయన మంగళవారం పుదుచ్చేరితోపాటు సవిూపంలోని రోడీర్‌ పేట్‌, రియాన్‌ కుప్పం, కృమామ్‌ బక్కమ్‌ ఇతర వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తారు. అలాగే తమిళనాడులోని కడలోర్‌ జిల్లాలో కూడా రాహుల్‌ గాంధీ పర్యటించనున్నారు.