మే లో రేషన్‌ కార్డుల పంపిణీ

3

– మంత్రి ఈటెల రాజేందర్‌

హైదరాబాద్‌,ఏప్రిల్‌28: వచ్చేనెల నుంచి కొత్త రేషన్‌కార్డులు జారీ చేయనున్నట్టు ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్‌ తెలిపారు. ఈ మేరకు అధి కారులతో ఎంసీహెచ్‌ఆర్డీలో జాయింట్‌ కలెక్టర్లతో సవిూక్ష నిర్వహించారు.  సమావేశం ముగిసిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు. ఐదేళ్లలోపు పిల్లలకు రేషన్‌ కట్‌ చేస్తున్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని తేల్చిచెప్పారు. ఇంట్లో ప్రతీ సభ్యుడికి ఆరు కిలోల బియ్యం ఇస్తున్నట్టు పేర్కొన్నారు. త్వరలో రేషన్‌షాపుల్లో బయోమెట్రిక్‌ విధానాన్ని అమలు చేస్తున్నట్టు మంత్రి తెలిపారు. రేషన్‌ డీలర్లు అవినీతికి పాల్పడితే జైలుకు వెళ్లకతప్పదని హెచ్చరించారు. ధాన్యం కొలుగోలు కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని జాయింట్‌ కలెక్టర్లకు మంత్రి ఈటెల ఆదేశించారు. కార్డుల పంపిణీలో భాగంగా వచ్చే నెల నుంచి పర్మినెంట్‌ రేషన్‌కార్డులిస్తామని మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు.  వడ్ల కొనుగోలు కేంద్రాల్లో గతంలో కనీస సౌకర్యాలు లేవని..రాష్ట్రవ్యాప్తంగా వెంటనే వడ్ల కేంద్రాలను ఏర్పాటుచేస్తమని స్పష్టంచేశారు. హాస్టల్‌ విద్యార్థులకు కడుపునిండా అన్నం పెడుతున్నామని  పేర్కొన్నారు. అవకతవకలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రభుత్వం అందించే పథకాలు పేద ప్రజలకు లబ్ధి చేకూరేలా అన్ని చర్యలు తీసుకుంటామని పునరుద్ఘాటించారు