మే 2న ఉద్యోగ మేళా
రంగారెడ్డి , జనంసాక్షి: జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో మే 2న ‘టు డోర్ మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్’ నందు సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు (30) భర్తీ కోసం ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి రజనీప్రియ ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు డిగ్రీ, ఎంబీఏ (మార్కెటింగ్) ఉత్తీర్ణులై, 18 నుంచి 35 సంవత్సరాల వయసు కలిగి ఉండాలన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు సంబంధిత ధ్రువపత్రాలతో జిల్లా ఉపాధి అధికారి కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. ఇతర వివరాలకు 040-23321040, 998344300 లేదా 9666786899 ఫోన్ సంఖ్యలను సంప్రదించాలని సూచించారు.