మే 2న రాష్ట్రవ్యాప్తంగా పాలిటెక్నిక్‌ ప్రవేశ పరీక్ష

హైదరాబాద్‌: మే 2న రాష్ట్రవ్యాప్తంగా 622 కేంద్రాల్లో పాలిటెక్నిక్‌ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ అజయ్‌జైన్‌ వెల్లడించారు. ప్రవేశ పరీక్షకు 2,51,483 మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు చెప్పారు. మే 4న ప్రవేశ పరీక్ష కీ విడుదల చేస్తామని తెలిపారు.