మైనంపల్లి హనుమంతరావు రౌడీయిజం పనికిరాదు
మంత్రి హరీష్ రావు పై ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం సరికాదుపార్టీ మైనంపల్లిపై క్రమశిక్షణ తీసుకోవాలిసంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యేలు ,TSHDC చైర్మెన్ చింతా ప్రభాకర్ సంగారెడ్డి బ్యూరో , జనం సాక్షి , ఆగస్ట్ 21 :మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు రౌడీయిజం పనికిరాదనీ, మంత్రి హరీష్ రావు పై ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం ఆయనకు సరికాదనీ, పార్టీ మైనంపల్లిపై క్రమశిక్షణ తీసుకోవాలని సంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యేలు ,TSHDC చైర్మెన్ చింతా ప్రభాకర్ లు అన్నారు.సంగారెడ్డి టీఎస్ హెచ్ డి సి చైర్మన్ చింత ప్రభాకర్ క్యాంపు కార్యాలయంలో టీఎస్ హెచ్ డి సి చైర్మన్ చింత ప్రభాకర్ , అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ , జైరాబాద్ ఎమ్మెల్యే మాణికరావులు , డి సి ఏ ఎం ఎస్ చైర్మన్ శివకుమార్ లు విలేకరుల సమావేశం నిర్వహించారు .ఈ సందర్భంగా వారు మైనంపల్లి అనుచిత వ్యాఖ్యలపై కౌంటర్ ఇచ్చారు . ఈ సందర్భంగా చింత ప్రభాకర్ మాట్లాడుతూరాష్ట్రంలో నూతన సార్వత్రిక ఎన్నికల్లో సీఎం కేసిఆర్ అభ్యర్థులను ఖరారు చేసిన సందర్భంగా సీఎం కేసిఆర్ కు శిరసు వంచి ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న పరిపాలన ఆయన కొనియాడారు . కెసిఆర్ ప్రవేశపెట్టిన పథకాలను ఈ విధంగా ఆయన గుర్తు చేశారు. రాష్ట్రం దేశంలోని అభివృద్ధి పథంలో పయనిస్తుందని దేశానికి రాష్ట్రం ఆదర్శం అన్నారు . ఇంత మంచి పాలన అందిస్తున్న ముఖ్యమంత్రి కి మరొకసారి మూడోసారి ముచ్చటగా ముఖ్యమంత్రి చేయాలని ఆయన పిలుపునిచ్చారు . ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావుకు, మరియు మంత్రి కేటీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. మంత్రి హరీష్ రావు పార్టీకి సేవ చేస్తున్న వ్యక్తి అని కొనియాడారు . ఆయన మంత్రిగా సేవలు అందిస్తున్నారు అన్నారు. మైనంపల్లి హనుమంతరావు మంత్రి హరీష్ రావు పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సరికాదని, మైనంపల్లి వెంటనే హరీష్ రావుకు బహిరంగ క్షమాపణ చెప్పా లని అన్నారు. మైనంపల్లి రౌడీ ఇజం ఇక్కడ పనికిరాదని, పార్టీకి ఎంతటివారైనా పనికి మణిగి ఉండాలన్నారు . ఆయన మంత్రిపై రౌడీ ఇజం మాటలు మాట్లాడం దుర్మార్గ మన్నారు. ఆయనకు పార్టీ , రాజకీయ క్రమశిక్షణా తెలియ దన్నారు. హనుమంతు రావు వ్యాఖ్యలు పిచ్చోడి చేతిలో రాయి లా ఉన్నాయని ఆయన విమర్శించారు.రాష్ట్ర ప్రజలు హనుమంతు రావు వ్యాఖ్యలు సహించరని అన్నారు . మైనంపల్లి హన్మంతరావు హరీష్ రావు గోటి దుమ్ముతో సమానమన్నారు. మంత్రి హరీష్ రావు నిరంతరం శ్రామికుడు ,ప్రజల నిండు మనసుతో ఎక్కడ లేని విధంగా భారీ మెజారిటీ తో ఆశీర్వదించారన్నారు. రాబోయే ఎన్నికల్ల సీఎం కేసిఆర్ ను మూడో సారి సీఎం అవ్వడం ఖాయమన్నారు. ఈ సందర్భంగా చంటి క్రాంతి కిరణ్ మాట్లాడుతూ తననుఆందోల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించినందుకు సీఎం కేసిఆర్ కు ధన్యవాదాలు తెలిపారు.పార్టీ ఎదగడానికి ,పార్టీ అభివృద్ధి మంత్రి హరీష్ రావు కీలక మనీ కొనియాడారు .మంత్రి హరీష్ రావు పై మైనంపల్లి హన్మంతరావు వ్యాఖ్యలు సరికాదనీ విమర్శించారు మైనంపల్లి పార్టీ అధినాయకత్వం ధిక్కరిస్తూ మాట్లాడం దుర్మార్గ మన్నారు.మైనంపల్లి కి సున్నితంగా చెప్తున్నాం పద్దతి మార్చుకోవాలనీ హితవు పలికారు రాష్ట్రంలో మంత్రి హరీష్ రావు ఎక్కడ నుండి ఎన్నికలో పోటీ చేసిన లక్ష మెజారిటీ తో గెలవడం ఖాయమన్నారు. అనంతరం జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్యరావు , డీసీఎంఎస్ చైర్మన్ శివ కుమారులు మాట్లాడుతూ పార్టీ మైనంపల్లి హన్మంతరావు పై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలేని డిమాండ్ చేశారు . మంత్రి హరీష్ రావుకు ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు . మైనంపల్లి రౌడీయిజం పనికిరాదని , ప్రజాస్వామ్ నెంబరు ప్రజాస్వామ్య బద్ధంగా ఉండాల్సిన అవసరం ఉంటుందన్నారు . మంత్రి హరీష్ రావు పై వ్యాఖ్యలు చేయడం ఆయనకు ఎంతవరకు సమంజసమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మైనంపల్లి రాబోయే రోజుల్లో తగిన మూల్యం చెల్లించుకుంటాడన్నారు . ఈ కార్యక్రమంలో మాజీ సి డి సి చైర్మన్ విజయేందర్ రెడ్డి, కంది జెడ్పిటిసి కొండల్ రెడ్డి , సంగారెడ్డి మున్సిపల్ చైర్మన్ బొంగులో విజయలక్ష్మి , కౌన్సిలర్లు జలంధర్, నాని, నాయకులు మాసంపల్లి నారాయణ, విజయ్ కుమార్, నర్సింలు, శ్రవణ్ రెడ్డి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.