మైనర్ బాలికపై అత్యాచారం..
భాజపా ఎమ్మెల్యేకు 25 ఏళ్ల జైలు శిక్ష
సోన్‌భద్ర(జనంసాక్షి): మైనర్ బాలికపై అత్యాచారం చేసిన కేసులో ఉత్తర్‌ప్రదేశ్‌లో భాజపా ఎమ్మెల్యేకు ప్రజాప్రతినిధుల న్యాయస్థానం 25 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది.దీంతో ఆయనపై అనర్హత వేటు పడిరది. ప్రజాప్రతినిధుల చట్టం ప్రకారం.. రెండేళ్లు, అంతకంటే ఎక్కువ కాలం శిక్ష పడిన ప్రజాప్రతినిధిని అనర్హుడిగా ప్రకటిస్తారు. వివరాల్లోకి వెళితే..సోన్‌భద్ర జిల్లా దుద్ది శాసనసభ నియోజవర్గం ఎమ్మెల్యే రామ్‌దులర్ గోండ్‌పై 2014 నవంబరు 4వ తేదీన పోక్సో కేసు నమోదైంది. గోండ్ భార్య గ్రామ సర్పంచిగా ఉన్న సమయంలో ఆయన ఓ మైనర్ బాలికపై అత్యాచారం చేసినట్లు బాధితురాలి సోదరుడు మయోర్‌పుర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన దుద్ది శాసనసభ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో కేసును ప్రజాప్రతినిధుల న్యాయస్థానానికి బదిలీ చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ అహసన్ ఉల్హా ఖాన్ మంగళవారం తీర్పును రిజర్వు చేసి, శుక్రవారం వెల్లడిరచారు.ఈ కేసులో గోండ్‌ను దోషిగా తేల్చిన న్యాయస్థానం, ఆయనకు 25 ఏళ్ల కఠిన కారాగార శిక్షతోపాటు రూ.10 లక్షలు జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది. తీర్పు వెలువరించడానికి ముందు శిక్ష తగ్గించాలని కోరుతూ.. గోండ్ తరపు న్యాయవాది చేసిన విజ్ఞప్తిని కోర్టు కొట్టివేసింది. బాధితురాలి కుటుంబ బాధ్యతలను చూసుకుంటానని గోండ్ ఇచ్చిన హామిని సైతం కోర్టు పరిగణనలోకి తీసుకోలేదు.