మైనారిటీల సంక్షేమానికి సర్కారు కట్టుబడి ఉంది

4

– మంత్రి కేటీఆర్‌ సమీక్ష

హైదరాబాద్‌,డిసెంబర్‌4(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర సర్కారు మైనారిటీల సంక్షేమానికి కట్టుబడి ఉంటుందని మంత్రి కల్లకుంట్ల తారకరామారావు తెలిపారు. శుక్రవారం

రాష్ట్రంలో మైనారిటీ సంక్షేమంపై మంత్రి కేటీఆర్‌ సవిూక్ష జరిపారు. ఈ సమాశానికి మైనార్టీ సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు, ఎంఐఎం పార్టీ శాసనసభ పక్ష నేత అక్బరుద్దిన్‌ ఒవైసీ హాజరయ్యారు. విదేశాల్లో చదువుతున్న మైనార్టీ విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న సాయాన్ని ఈ నెల 15లోగా చెల్లించాలని ఆదేశాంచారు మంత్రి కేటీఆర్‌. చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలోని కూర్మగూడలో పెండింగ్‌ లో ఉన్న శ్మశాన వాటిక స్థలాన్ని వెంటనే స్వాధీనం చేసుకుని అందుబాటులోకి తేవాలన్నారు. మైనారిటీ విద్యార్థులకు ుంూఐ ద్వారా మరిన్ని శిక్షణ కార్యక్రమాలను అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను మంత్రి కేటీఆర్‌ ఆదేశించారు. షాదీ ముబారక్‌ ద్వారా అందిస్తున్న సాయాన్ని ఆలస్యం చేయొద్దన్నారు. మైనారిటీ సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని.. దీనికోసం అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మైనారిటీలకు ఎస్సీ, ఎస్టీలతో సమానంగా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసేందుకు త్వరలోనే అధికార ఉత్తర్వులివ్వాలని అధికారులను ఆదేశించారు. ముస్లిం మైనారిటీ విద్యార్థుల సౌకర్యం కోసం ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలను ఉర్దూ విూడియంలో నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని మంత్రిని అక్బరుద్దిన్‌ ఒవైసీ కోరారు.