మొక్కలు నాటుదాం రండి: ఎమ్మెల్యే
యాదాద్రి,జూలై1(జనం సాక్షి): ఆలేరు నియోజకవర్గంలోని అన్ని చెరువులను 2018చివరి నాటికి కాల్వల ద్వారా నింపడానికి కృషి చేస్తున్నామని ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత అన్నారు. అన్నదాతల సంక్షేమమే ధ్యేయంగా అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ రైతు పక్షపాతిగా నిలిచిన గొప్ప నాయకుడు సీఎం కేసీఆర్ అని అన్నారు. రైతులందరికీ రైతుబంధు అమలు చేయడంతో పాటు బీమాలను కూడా చెల్లించింది ఒక్క టీఆర్‌ఎస్ ప్రభుత్వమే అన్నారు. హరితహారంలో భాగంగా ప్రతీ ఒక్కరు మొక్కలు నాటాలని అన్నారు. నాటిన ప్రతీ మొక్కను కాపాడుకుని పచ్చటి తెలంగాణను సాధించుకుందామనిఅన్నారు. కరువు ప్రాంతమైన ఆలేరులో విరివిగా మొక్కలు పెంచి కరువును జయిద్దామని ఆమె పిలుపునిచ్చారు. అన్ని ప్రభుత్వ కార్యలయాల్లోనూ మొక్కలు నాటి, వాటిని కాపాడే బాధ్యత సంబంధిత అధికారులదేనని వారు అన్నారు. ప్రతీ గ్రామంలో మొక్కలను కాపాడితే హరితహారం విజయవంతం కాగలదని అన్నారు.