మొక్కల పెంపకానికి ప్రాధాన్యం
మెదక్,జూన్6(జనం సాక్షి): పైలట్ ప్రాజెక్టు కింద మెదక్ నియోజకవర్గ పరిధిలోని 25 గ్రామాలను దత్తత తీసుకొని మొక్కలు నాటి పెంచే కార్యక్రమం చేపట్టనున్నట్లు ద్వారకా చారిటబుల్ ట్రస్టు చైర్మన్ మ్యాడం బాలకృష్ణ వెల్లడించారు. మెదక్ నియోజకవర్గ పరిధిలోని 25 గ్రామాల్లో దత్తత తీసుకొని ఆ యా గ్రామాల్లో సంరక్షకులను నియమించి గ్రా మస్తుల సాయంతో సొసైటీ ఆధ్వర్యంలో వారికి వేతనం చెల్లించి మొక్కల పెంపకం బాధ్యత అప్పగిస్తామన్నారు. అన్ని గ్రామాల్లో మొక్కల పెంపకానికి చర్యలు తీసుకోనున్నట్లు ఆయన వెల్లడించారు.