మొక్కల సంరక్షణకు ప్రత్యేక చర్యలు

మెదక్‌,ఏప్రిల్‌2(జ‌నంసాక్షి): హరితహారం కింద మొక్కలు నాటడంతో వదిలేయక, అవి పెరిగి పెద్దయ్యే వరకు ఐదారు సంవత్సరాల వరకు సంరక్షణ చర్యలు చేపడతామని జిల్లా అటవీ శాఖాధికారి అన్నారు. ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనున్న హరితహారం కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించేందుకు విస్తృత చర్యలు చేపట్టినట్లు అన్నారు. అటవీ సంరక్షణ విషయంలో పోలీసుల సహకారం తీసుకోవాలని ముఖ్యమంత్రి నిర్ణయించారని ఈ మేరకు ఆదేశాలు కూడా జారీ చేశారన్నారు. ముఖ్యమంత్రి నియోజకవర్గమైన గజ్వేల్‌ ప్రాంతంలో 13,000 హెక్టార్ల విస్తీర్ణంలోని అటవీ ప్రాంతంలో 34 బ్లాకులు ఉన్నాయని, 251 కిలోవిూటర్ల పొడవున అటవీ ప్రాంతం చుట్టూ రెండు విూటర్ల లోతు, రెండు విూటర్ల వెడల్పుతో రక్షణ కందకాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు.  తెలంగాణా హరితహారం కోసం 41 కోట్ల మొక్కలను పెంచనున్నట్లు చెప్పారు. అటవీ అభివృద్ధికి నిధుల కొరత లేదని తెలిపారు. 41 కోట్ల మొక్కల పెంపకం జరుగుతోందని జూన్‌ 1 నుంచి సెప్టెంబర్‌ లోపు వర్షాకాలంలోగా వాన్నింటిని నాటే కార్యక్రమం పూర్తి చేస్తామన్నారు.