మొగల్‌ చక్రవర్తిని గడగడలాడించిన వీరుడు…

– గోల్కొండ కోటపై విజయపతాకం ఎగరవేసిన
ధీశాలి.
– ఓబిసి జిల్లా అధ్యక్షుడు నిరంజన్ గౌడ్.
ఊరుకొండ, ఆగస్టు 18 (జనం సాక్షి):
మొగల్ చక్రవర్తిని గడగడ లాడించిన వీరుడు.. గోల్కొండ కోటపై విజయ పతాకం ఎగరవేసిన దీశాలి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని ఓబిసి జిల్లా అధ్యక్షుడు వాగుల్ దాస్ నిరంజన్ గౌడ్, గౌడ సంఘం మండల అధ్యక్షుడు సంగప్ప గౌడ్ లు అన్నారు. గురువారం ఊరుకొండ మండల గౌడ కమిటీ ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 372వ జయంతి పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఢిల్లీ పీఠాన్ని గడగడలాడించిన తొలి తెలుగు తేజం, గోల్కొండ కోటపై మొగలాయిల పెత్తనాన్ని ధిక్కరించిన ధీశాలి. ఔరంగజేబుకే ముచ్చమటలు పట్టించిన పోరాట యోధుడు.. పేదలపాలిట ఆపద్బాంధవుడు అనీ కొనియాడారు. సమసమాజ స్థాపన సాధనకు ప్రాణాలను పణంగా పెట్టిన వీరుడు, రాజరికంలో వికసించిన సామ్యవాద గొంతుక సర్దార్‌ సర్వాయి పాపన్న మహావీరుడు అని అన్నారు. గోల్కొండ ఖిల్లాపై విజయ పతాకాన్ని ఎగరేయడమే లక్ష్యంగా తుదివరకు పోరాడిన వీరుడు సర్వాయి పాపన్న గౌడ్‌ అనీ గుర్తు చేశారు. జన హృదయంలో అతనొక సర్దార్‌. మొట్టమొదట పన్నెండు మందితో మొదలైన ఆ పోరాటంలో చాకలి సర్వన్న, మంగలి మాసన్న, కుమ్మరి గోవిందు, జక్కుల పెరుమాళ్లు, దూదేకుల పీరు, కొత్వాల్‌ మీరు సాహెబ్‌…వీరంతా ఆయన ప్రధాన అనుచరులు అని అన్నారు. కార్యక్రమంలో బీసీ యువజన సంఘం డివిజన్ అధ్యక్షుడు బోల్గం దివాకర్ గౌడ్, గౌడ కులస్థులు నేడు గుర్తించుకున్నారు. మండల గౌడ కుల పెద్దలు సంగప్ప గౌడ్, శ్యామ్ గౌడ్, నర్సంపల్లి సర్పంచ్ నిరంజన్ గౌడ్, మాజీ సర్పంచ్ కృష్ణ గౌడ్, మల్లికార్జున్ గౌడ్, జయరాములు గౌడ్, అరవింద్ గౌడ్, నితీష్ గౌడ్, మల్లేష్, ఆంజనేయులు, శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.