మొబైల్స్ షాపులో చోరీ
మెదక్, నవంబర్ 9: వైష్ణవి మొబైల్స్‌లో గుర్తు తెలియని దొంగలు షాపులో చొరబడి 80వేల రూపాయలు విలువ చేసే నోకియా, సామ్‌సంగ్, చైనా మొబైల్స్, మరమ్మతులకు వచ్చిన మొబైల్స్ అపహరించారిన మెదక్ సిఐ విజయ్‌కుమార్ తెలిపారు. వైష్ణవి మొబైల్స్ యజమాని కృష్ణకుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ విజయకుమార్ తెలిపారు.