మోగిన స్థానిక ఎమ్మెల్సీ నగారా
హైదరాబాద్ నవంబర్ 24 (జనంసాక్షి):
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు నగారా మోగింది. 12 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు ఈసీ షెడ్యూల్ రిలీజ్ చేసింది. మహబూబ్‌నగర్, కరీంనగర్, రంగారెడ్డి జిల్లాల్లో రెండేసి స్థానాలు.. ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, నల్లగొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో ఒక్కో స్థానంలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగనున్నాయి. ఇందుకోసం డిసెంబర్ 2న నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్ దాఖలుకు చివరితేదీ డిసెంబర్9 కాగా.. 10న నామినేషన్ల పరిశీలన జరగనుంది. 12 వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు విధించారు. డిసెంబర్ 27న పోలింగ్, 30న ఫలితాలు వెలువడనున్నాయి.