మోడల్ స్కూల్లో ఏర్పాటుచేసిన కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్ సందర్శించిన వైద్యాధికారి.
ములుగు జిల్లా బ్యూరో, జూలై 26(జనంసాక్షి):-
ములుగు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అళ్ళెం అప్పయ్య ఆదేశానుసారం మేరకు గోవిందరావుపేట పిహెచ్సి వైద్య సిబ్బంది చల్వాయి గ్రామం పరిధిలో గల మాడల్ స్కూల్లో ఏర్పాటుచేసిన కోవిడ్ 19 వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా 12 సంవత్సరాల నుండి 14 సంవత్సరాల వయసు గల పిల్లలకు ఒకటవ,రెండవ డోస్ వ్యాక్సినేషన్ వేయడం జరిగింది.ఇందులో భాగంగా జిల్లా అధికారి స్కూల్ పిల్లలకు కోవిడ్ పైన కొన్ని ప్రశ్నలు అడగగా ఉదయ్ కిరణ్ అనే పిల్లవాడు చకచగా సమాధానం ఇచ్చినారు. పాఠశాల సిబ్బంది ప్రిన్సిపాల్ తో చర్చించగా ఏడు ,ఎనిమిదవ తరగతిలో 124 పిల్లలు ఉండగా అందరికీ వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని వైద్యాధికారి చెప్పడంతో ,ప్రిన్స్ పాల్ పాఠశాలకు సెలవులు రావడంతో పిల్లలు రాలేకపోయినారు అని బదులు ఇవ్వడంతో రేపు లేక ఎల్లుండి పిల్లలకు వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని వైద్య సిబ్బంది కి ఆదేశించారు.తదనంతరం పిల్లలకు వండిన వంటలను పరిశీలించినారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపాల్ నిజాముద్దీన్ , స్వప్న శ్రీ టీచర్ ,హెల్త్ అసిస్టెంట్ జంపయ్య ,ఏఎన్ఎం లలిత ,ఆశాలు పాల్గొన్నారు.