మోడీపై సమరశంఖం..టార్గెట్‌ బిజెపి

ప్రాంతీయ పార్టీలను ఏకం చేసేలా కార్యాచరణ
మహానాడు వేదికగా స్పష్టమైన సంకేతాలు
అట్టహాసంగా తెలుగుదేశం మహానాడు
అమరావతి,మే28(జ‌నం సాక్షి): మహానాడు వేదికగా తెలుగుదేశం అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజకీయ నిర్మాణంపై స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. ఇక కేంద్రంతో పోరాటమే శరణ్యమని తెలియ చేశారు. మళ్లీ మోడీ ప్రధాని అయ్యే ఛాన్స్‌ లేదని ఘంటాపథంగా చెప్పారు. అలాగే ప్రాంతీయ పార్టీల ఐక్యతను చాటారు. రాబోయే కాలంలో బిజెపిపై గట్టి పోరాటం తప్పదని ఖఱాఖండిగా చెప్పారు. నాలుగేళ్ల పాటు బిజెపితో నెరిపిన నెయ్యం ఒక ఎత్తయితే ఇప్పటి నుంచి ఇక టిడిపి అనుసరించే వ్యూహం మరో ఎత్తని కార్యకర్తలకు స్పష్టమైన దిశానిర్దేశం చేవానే. అటు బీజేపీ, ఇటు వైసీపీని లక్ష్యంగా చేసుకుని విరుచుకుపడ్డారు. ఆ రెండు పార్టీలు కుమ్మక్కయ్యాయని… ఢిల్లీ నుంచి వచ్చిన స్క్రిప్టు ప్రకారమే వైసీపీ తనపై విమర్శలు గుప్పిస్తోందని ఆరోపించారు. కాం/-గరెస్‌ ఇక్కడ నామమాత్రం కావడంతో ఈ రెండు పార్టీలనే బాబు టార్గెట్‌ చేవారు.  ప్రధాని మోదీపై గతంలో ఎన్నడూ లేని స్థాయిలో మండిపడడం ద్వారా కేంద్రానికి వెరిచేది లేదని కూడా స్పీష్టీకరించారు. ఎంతగా అంటే మోడీ  మళ్లీ ప్రధాని కావడం కల్ల అని తేల్చి చెప్పారు. తిరుమలను ‘కబ్జా’ చేయడానికి కూడా కేంద్రం ప్రయత్నించిందని విమర్శించారు. రాష్ట్రానికి  అన్యాయం చేసినవారి గుండెళ్లో ఈ మహానాడు ద్వారా రైళ్లు పరిగెత్తిస్తామన్నారు. విజయవాడ కానూరులోని సిద్ధార్థ కళాశాల మైదానంలో మొదలైన మహానాడులో చంద్రబాబు అధ్యక్షోపన్యాసం కార్యకర్తల్లో ఉత్సాహం నింపిది. ఓ రకంగా ఇది ఎన్నికల ముందు శంకరావంగా మారింది.  రాష్ట్రంలో తెలుగుదేశానికి తిరిగి అధికారం దక్కాలని… ఇది చారిత్రక అవసరమని చెప్పారు. కేంద్రంలో కాంగ్రెస్‌ రాదు…. బీజేపీ అసలే రాదు… మళ్లీ ప్రాంతీయ పార్టీలు చక్రం తిప్పుతాయి. ప్రాంతీయ పార్టీల్లో సమర్థ నాయకులున్నారు. వారిని కావాలని దెబ్బతీయాలనుకుంటే బొబ్బిలిపులిలా తిరిగొస్తారు. కొండవీటి సింహంలా గర్జిస్తారు. మొన్న కర్ణాటకలో దేశం కోసమే అన్ని ప్రాంతీయ పార్టీలు ఒక వేదికపైకి వచ్చాయని, ఇప్పుడు మళ్లీ దేశంలో అదే జరగబోతున్నదని సూచన చేశారు. అంతేగాకుండా ఈ019లో టీడీపీ కోరుకున్న విధంగానే కేంద్ర ప్రభుత్వం ఏర్పడుతుందని స్పష్టంచేశారు. ఇందుకోసం అన్ని ప్రాంతీయ పార్టీలతో మాట్లాడతానని, అవసరమైతే అన్ని రాష్ట్రాలకు వెళ్లి ఏపీకి జరిగిన అన్యాయం, ప్రస్తుత పరిస్థితులను వివరిస్తానని ప్రకటించారు. అదే సమయంలో… తనకు ప్రధానమంత్రి కావాలన్న ఆలోచన మాత్రం లేదని మరోమారు తేల్చి చెప్పారు. మొత్తంగా మరోమారు ప్రాంతీయ పార్టీలకు తానే నేతృత్వం వహించడం ద్వారా గత నేషనల్‌ ఫ్రంట్‌ విధానంతో ముందుకు సాగేందుకు సమాయత్తం అవుతున్న సూచనలు ఇచ్చారు. ఇక రాస్ట్రానికి సంబంధించి కూడా బిజెపి తీరుపై నిప్పులు చెరిగారు. బీజేపీ న్యాయం
చేయకపోగా గట్టిగా అడిగితే మనపైకి కొన్ని పార్టీలను ఉసిగొల్పుతున్నారు.  రాష్ట్రంలో 68శాతం ప్రజలకు మోదీకి వ్యతిరేకంగా ఉన్నారని ఓ సర్వేలో తేలింది. మొత్తం నూరుశాతం ప్రజలు మోదీపై అసంతృప్తి వ్యక్తం చేయాలి! నాలుగేళ్లలో బీజేపీ కేంద్రంలో ఏం చేసింది? రాష్ట్రంలో మనమేం చేశాం? దీనిపై చర్చకు సిద్దం అని ప్రకటించారు. మోదీ ప్రచార ప్రధానమంత్రి అంటూ  బ్యాంకులను దివాలా తీయించారు. వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెట్టేశారు. జన్‌ధన్‌, మేకిన్‌ ఇండియా, స్టార్టప్‌ ఇండియా అన్నారు. ఏదైనా జరిగిందా? అవినీతి ప్రక్షాళన జరుగుతుందని పెద్ద నోట్ల రద్దుకు నేనూ సహకరించాను. కానీ… వీళ్లు చేసిన చర్యల వల్ల బ్యాంకులపై ప్రజలు నమ్మకం కోల్పోయే పరిస్థితి వచ్చింది. బ్యాంకుల్లో ఎగవేతలు భారీగా పెరిగాయి.నగదు కొరత ప్రజలను వేధిస్తోంది. /ూష్ట్ర ప్రయోజనాలపై కేంద్రంపై పోరాడిన టీడీపీ ఎంపీలను కేంద్రం అనేక రకాలుగా బెదిరించింది. ఇన్‌కమ్‌ ట్యాక్స్‌, ఈడీ, సీబీఐ కేసులు పెడతామని కూడా హెచ్చరించారు. అయినా వాటిని లెక్క చేయకుండా మన ఎంపీలు ఉభయసభల్లోనూ వీరోచితంగా పోరాడారంటూ రకరకాల సమస్యలను ఏకరువు పెట్టారు. మొత్తంగా మోడీయే తమ తదుపరి టార్గెట్‌గా చంద్రబాబు ప్రకటించారు. ఇక జాతీయ స్థాయిలో ప్రచారానికి కూడా ప్రణాళిక సిద్దం చేస్తున్నారు. ప్రాంతీయ పార్టీలను ఏకతాటిపైకి తీసుకుని వచ్చే క్రమంలో వియం సాధిస్తారా అన్నది చూడాలి
——————