మోడీ కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి
సేవ్ ఇండియా కార్యక్రమంలో సిఐటియూ ఆందోళన
విజయవాడ,ఆగస్ట్9(జనంసాక్షి): మోడీ ప్రభుత్వం తీసుకోచ్చిన కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని సిఐటియు నేతలు డిమాండ్ చేశారు. దేశవ్యాప్త సేవ్ ఇండియా కార్యక్రమం సంధర్భంగా
సిఐటియు ఆధ్వర్యంలో కొండపల్లి ఇండస్టియ్రల్ ఏరియాలో ఆందోళన చేశారు. ఈ సందర్భంగా సిఐటియు మండల కార్యదర్శి యం మహేష్ మాట్లాడుతూ వైజాగ్ స్టీల్, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటికరణను అపాలని, విద్యుత్ సవరణ బిల్లు 2021ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన జాతీయ విద్యా విధానం పేరుతో అంగన్వాడీ సెంటర్స్ ను ప్రాధమిక పాఠశాలలో వీలీనం చేసే సర్క్యులర్ 172ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కరోనా మహమ్మారిని ఎదిరించి పోరాడిన స్కీం వర్కర్స్ ఆశా, ఆరోగ్య సిబ్బందికి 50 లక్షల భీమా సౌకర్యం కల్పించాలని కోరారు. పెరిగిన గ్యాస్, పెట్రోల్, డిజిల్ ధరలు తగ్గించి ప్రజలపై భారాలు పడకుండా చూడాలని డిమాండ్ చేశారు. స్థానికంగా మున్సిపాలిటీలో ఇంటి పన్ను చెత్త పన్ను ప్రజలపై మోపవద్దని, బిల్డింగ్ వర్కర్స్ కి పెండిరగ్ ª`లకైమ్స్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కొండపల్లి ఎఆం నుండి ఆయిల్ / గ్యాస్ ట్యాంకర్స్ కి గోల్లపూడి వయా విజయవాడ టౌన్ లోకి 24 గంటలు రూట్ క్లియరెన్స్ ఇవ్వాలని, ఉపాధి హవిూ పధకం పెండిరగ్ బిల్లులు ఇవ్వాలని, పట్టణంలో పని కల్పించాలని, తెల్ల రేషన్ కార్డుదారులందరీకి నెలకు రూ.7500/` ఆర్థిక సహకారం అందించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు సుబ్బారావు , అంబటి శ్రీనివాస్ , రవి , వెంకటేశ్వర్లు బాస్కర్ తదితరులు పాల్గొన్నారు