మోతె గ్రామానికొస్తా

5

– సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌,ఏప్రిల్‌28జనంసాక్షి)

తొలిసారిగా తెలంగాణ తీర్మానం చేసిన మోతె గ్రామాన్ని మరోమారు సందర్శించాలని ఆ గ్రామస్థులు మరోమారు సిఎంను కోరారు. బా ల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌ రెడ్డి ఆధ్వ ర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను నిజామాబాద్‌ జిల్లా మోతె గ్రామస్థులు కలిశారు. మోతె గ్రామానికి మళ్లీ ఒకసారి రావాల్సిందిగా గ్రామ స్థులు సీఎంను కోరారు. గ్రామస్థుల కోరిక మేరకు మరోసారి మోతె గ్రామానికి త్వరలోనే వస్తానని సీఎం హావిూనిచ్చారు. తెలంగాణ ఉద్యమం ప్రారంభించినపుడు మోతెలో ము డుపు కట్టిన కేసీఆర్‌..తెలంగాణ వచ్చాక మోతె గ్రామానికి వెళ్లి ముడుపు విప్పిన విషయం తెలిసిందే. అయితే అధికారంలోకి వచ్చాక మరోమారు వస్తానని ఇచ్చిన హావిూ మేరకు రావాలని అన్నారు. ఈ గ్రామంలో తొలిసారిగా ప్రజలు తెలంగాణ కోసం మట్టిని ముడుపు కట్టారు. ఈ ముడుపు కోసం గ్రామానికి వచ్చిన కెసిఆర్‌ ముడుపు విప్పారు. గ్రామాన్ని అభివృద్ది చేస్తానని అన్నారు.

మోతె గ్రామస్థుల ఆనందోత్సాహాలు

త్వరలో సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మోతె గ్రామాన్ని సందర్శించనున్నారన్న వార్తతో గ్రామంలోని పలువురు ఆనందం వ్యక్తం చేశా రు. గతంలో ఓమారు వచ్చిన సిఎం తప్ప కుండా మళ్లీ వస్తారని,తమను పకలరిస్తారని అన్నారు.  ఈమేరకు సీఎం క్యాంప్‌ కార్యా లయంలో కేసీఆర్‌ను బాల్కొండ ఎమ్మెల్యే వేము ల ప్రశాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో మోతె గ్రామస్థులు కలిశారు. సిఎం ను కలిసిన వివరాలను గ్రామా నికి చేరవేశారు. దీంతో సిఎం నిర్ణయంపై గ్రామ టిఆర్‌ఎస్‌ నాయకులు ఆనందం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం కోసం మొదటి తీర్మానాన్ని చేసిన మోతె గ్రామాన్ని సందరి ్శంచాలని గ్రామస్థులు కోరారు. ఈ సందర్బంగా వారితో మాట్లాడుతూ.. త్వరలో తాను మోతె గ్రామాన్ని సందర్శిస్తానని హావిూ ఇచ్చారు. గ్రామస్థుల సమక్షంలో  అన్ని విషయాలు చర్చించుకుందామని అన్నారు. గ్రామాభివృద్ధి కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలి? రైతుల కోసం ఏం చేయాలి? అనే విషయాలను అక్కడే మాట్లాడుకుందామని

సీఎం సూచించారు. మోతె గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది చేస్తానని కూడా సీఎం హావిూ ఇచ్చారు. మోతె గ్రామంతో తనకు ఉన్న అనుబంధాన్ని సీఎం గుర్తు చేసుకున్నారు. 2001లో కేసీఆర్‌ తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంబించిన సమయంలో మోతె గ్రామస్థులు తెలంగాణ కావాలంటూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. దీనికి స్పందించిన కేసీఆర్‌ మోతె గ్రామానికి వెళ్లి ఆ ఊరి మట్టితో ముడుపు కట్టారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మళ్లీ గ్రామానికి వచ్చి ముడుపు విప్పుతానని ప్రకటించారు. అనుకున్నది అనుకున్నట్టుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్‌ మోతెకు వెళ్లి ముడుపు విప్పారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ… టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక మళ్లీ మోతె గ్రామాన్ని సందర్శిస్తానని మాట ఇచ్చారు. ఈ నేపథ్యంలో సీఎంను కలిసిన మోతె గ్రామస్థులు మళ్లీ తమ గ్రామాన్ని సందర్శించాలని విజ్ఞప్తి చేశారు. కాగా, తెలంగాణ రాష్ట్రం కోసం మోతె గ్రామం మొదటి తీర్మానాన్ని తీర్మానం చేసిన విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని వీరు గ్రామస్థులకు ఫోన్‌ ద్వారా సమాచారం ఇచ్చారు. సిఎం అంగీకరాంతో గ్రామంలో ఆనందోత్సాహాలు వ్యక్తం అయ్యాయి.