మోత్కూరు పద్మశాలి కాలనీలో స్ఫూర్తి భవనం ముందు జాతీయ చేనేత దినోత్సవం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా చేనేత వృత్తిలో ఉన్నటువంటి వృద్ధాప్య చేనేత కార్మికులు ఆరుగురికి సన్మాన కార్యక్రమం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ పద్మశాలీల కులస్తుల అందరికీ పది లక్షల రూపాయలు చేనేత బంధు ఇవ్వాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మండల నాయకులు, మోత్కూర్ మున్సిపాలిటీ పరిధిలోని చేనేత కార్మిక సంఘం నాయకులు, పట్టణ పద్మశాలి సంఘం నాయకులు పద్మశాలి కుల బాంధవులు అందరూ పాల్గొన్నారు. Attachments area

మోత్కూరు ఆగస్టు 7 జనంసాక్షి :
రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం, (జనం సాక్షి) యాచారం మండల పరిధిలోని  నందివనపర్తిలో ఆదివారం నిర్వహించిన మల్లన్న స్వామి  బోనాల పండుగ ఉత్సవాలు పోతురాజుల విన్యాసాలు, డోలు వాయిద్యాల నడుమ  అంగరంగ వైభవంగా నిర్వహించారు.  ఉత్సవాలకు ముఖ్య అతిథులుగా బి.ఎన్.రెడ్డి ట్రస్ట్ చైర్మన్ బిలకంటి శేఖర్ రెడ్డి, మాజీ సర్పంచ్ రాజు నాయక్, ఉపసర్పంచ్ గోవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ.. ఏటేటా నిర్వహిస్తున్న బోనాల పండుగ నేపథ్యంలో  స్వామివారి కృపవల్ల ప్రజలు భక్తులు సుఖ సంతోషాలతో ఉండాలని కోరారు డప్పులు, తాళాల మధ్య నెత్తి మీద బోనం పెట్టుకుని భక్తులు, మహిళలు భక్తి శ్రద్ధలతో బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు వారిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో పెద్ద గొల్ల సత్యనారాయణ చిన్న గొల్ల వంగూరి యాదయ్య, జనిగే వెంకటేష్ , రెడ్డమోని  రవి,సైతాన్ కృష్ణ, యాదవ సంఘం అధ్యక్షులు సైతాన్ శేఖర్,సైతాన్ బాలరాజు, వంగూరి సాయి,తదితరులు పాల్గొన్నారు