మోదీ నాట్‌ వెల్‌కమ్‌

3

– బ్రిటన్‌ పర్యటన నేపథ్యంలో ముందస్తు నిరసన

న్యూఢిల్లీ ,నవంబర్‌ 11,(జనంసాక్షి): ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి బ్రిటన్‌ పర్యటనకు ముందే చుక్కెదురు అయింది. ఆయన పర్యటనను బ్రిటన్‌ ఇండో అసోసియేషన్‌ అయిన ఆవాజ్‌ యూకే తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.  మోదీ రావొద్దంటూ యూకే పార్లమెంట్‌ వద్ద భారీ కటౌట్‌ ఏర్పాటు చేసింది. మోదీ పర్యటనను అడ్డుకుంటామని హెచ్చిరించటమే కాకుండా, ఆయనను హిట్లర్‌తో పోల్చుతూ ఏర్పాటు చేసిన ఫెక్సీని అధికారులు తొలగించారు. అయితే ఆవాజ్‌ యూకే మాత్రం తన ఆవేదన, ఆక్రోశాన్ని ట్విట్టర్‌ ద్వారా తెలుపుతూ… 2002లో గుజరాత్‌లో జరిగిన అల్లర్లకు మోదీనే కారణమని మండిపడింది.   కాగా ఈ నెల 12 నుంచి మోదీ విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. నవంబర్‌ 12వ తేదీ నుంచి 16వరకూ బ్రిటన్‌, టర్కీలో పర్యటిస్తారు.  టర్కీ రాజధాని అంకారాలో జరిగే జీ-20 దేశాల సదస్సులో మోదీ పాల్గొంటారు. కాగా మోదీ తొలిసారిగా బ్రిటన్‌లో పర్యటిస్తున్నారు.  ఆయన పర్యటనలో భాగంగా బ్రిటన్‌ రాణి క్వీన్‌ ఎలిజబెత్‌తో లంచ్‌, వాంబ్లే స్టేడియంలో ఎన్నారైలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.