మోదీ.. వట్టి మాటలు కట్టిపెట్టు
– ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్
మోతిహరి (బిహార్),అక్టోబర్26(జనంసాక్షి): బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకేరోజు అటు ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఇటు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ¬రా¬రి ప్రచారాన్ని నిర్వహించారు. మూడో దశ ఎన్నికలు జరుగనున్న మోతిహరిలో రాహుల్‌గాంధీ సోమవారం ప్రచారాన్ని నిర్వహిస్తూ.. ప్రధాని మోదీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మోదీ అబద్ధాలు చెప్పడం మాని.. పనిచేయడం మొదలుపెట్టాలని సూచించారు. ‘దేశ ప్రజలు తెలివైన వారని ప్రధానికి ఇప్పటికీ తెలిసింది. ఆయన అబద్ధాలు గుర్తించే తెలివి వారికి ఉంది. మోదీగారు ఇప్పటికైనా అబద్ధాలు మాని.. పనిమొదలుపెట్టండి’ అని రాహుల్ పేర్కొన్నారు. ‘మంచి రోజులు వస్తాయని ఆయన హావిూ ఇచ్చారు. ధరలను తగ్గిస్తామన్నారు. కానీ ఈ రోజు పప్పు కిలో ధర రూ. 200లకు చేరింది. అయినా మోదీ మౌనంగా ఉంటున్నారు’ అని విమర్శించారు.