.మోస్ట్ వాంటెడ్ డాన్ ఛోటా రాజన్ అరెస్టు
న్యూఢిల్లీ,అక్టోబర్26(జనంసాక్షి): మాఫియా డాన్ ఛోటా రాజన్ అరెస్టు అయ్యాడు. ఆస్ట్రేలియా పోలీసుల సహాయంతో ఇండోనేషియాలోని బాలీలో ఇంటర్‌పోల్ పోలీసులు రాజన్‌ను అదుపులోకి తీసుకున్నారు. దావూద్ ఇబ్రహీం 1993 ముంబాయి పేలుళ్ల తర్వాత కనిపించకుండా పోయిన విషయం విదితమే. ఎట్టకేలకు మాఫియా డాన్ చోటా రాజన్ పట్టుబడ్డాడు. భారత దేశంతో పాటు ప్రపంచ దేశాలకు కంటివిూద కునుకు లేకుండా చేస్తున్న చోటాజన్ దాదాపు రెండు దశాబ్దాలుగా తప్పంచుకుని తిరుగుతున్నాడు. 1995 నుంచి రాజన్ అజ్ఞాతంలో ఉన్నాడు. 20 ఏళ్లుగా ముంబై పోలీసులతో పాటు భారత నిఘా సంస్థలు చోటా రాజన్ కోసం గాలిస్తున్నారు. ఇప్పటికీ ముంబైలో జరిగే నేరాలతో చోటా రాజన్ హస్తముందనేది వాస్తవం. మొదట్లో అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీమ్, చోటారాజన్ ఇద్దరు మంచి మిత్రులు. ప్రస్తుతం ఇద్దరు బద్ద శత్రువులు. కొంత కాలంగా ఇరువర్గాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. రాజన్ పట్టుబడటానికి దావూద్ అనుచరులే సమాచారమిచ్చి ఉంటారని నిఘావర్గాలు చర్చించుకుంటున్నాయి. రాజన్‌ను భారత్‌కు అప్పగించే అవకాశముందని ఇండోనేషియా పోలీసులు చెబుతున్నారు.ఇండోనేషియా బాలిలో అతను అజ్ఞాతంలో ఉండగా ఇంటర్ పోల్ పోలీసులు అరెస్టు చేశారు. ఆస్టేల్రియా పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు రాజన్ ను పట్టుకున్నట్లు చెబుతున్నారు. ఈ విషయాన్ని భారత కేంద్ర ¬ం శాఖ కూడా దృవీకరించింది.ఉగ్రవాది దావూద్ ఇబ్రహింకు అనుయాయిగా ఉన్న ఇతనిపై ముంబై,హైదరాబాద్ లలో పలు కేసులు ఉన్నాయి. అక్రమ ఆయుధాలు సరఫరా చేసిన కేసులో కూడా ఇతను నిందితుడు. ఇరవై ఏళ్ల తర్వాత ఇతనిని పోలీసులు పట్టుకోగలిగారు. అతడిని ఇండియాకు రప్పించాలని బారత్ ప్రయత్నిస్తోంది. ఇండోనేషియా ప్రభుత్వం, ఇంటర్‌పోల్‌లకు కేంద్ర¬ంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ధన్యవాదాలు తెలిపారు. మాఫియా డాన్ చోటా రాజన్ బాలిలో ఇంటర్‌పోల్‌కు పట్టుబడటంపై రాజ్‌నాథ్‌సింగ్ స్పందించారు. చోటా రాజన్‌ను బాలిలో పోలీసులు అరెస్టు చేసినట్లు సీబీఐ ధ్రువీకరించింది.