మోహినీ ఆవతారంలో శ్రీవారు
తిరుమల బ్రహ్మండనాయకుని బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఐదో రోజు ఉదయం అ దేవదేవుడు మోహినీ అవతరంలో తిరుమాడ వీదుల్లో వూరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. మోహినీ పక్కన పల్లకీలో వెన్నముద్దకృష్ణున్ని చూసి భక్తులు పులకించిపోయారు. భక్త బృందాలు హరినామస్మరణ చేస్తూ వాహనసేవలో పాల్గోన్నాయి . స్వామివారికి సాయంత్రం 5.30నుంచి వూంజల్ సేవ నిర్వహించనున్నారు. రాత్రి 8.30 నుంచి గరుడ వాహన సేవను వీక్షించి తరించాలని భక్తులు పెద్దసంఖ్యలో తిరుమలకు చేరుకుంటున్నారు.