మ్రైక్రో ఫైనాన్స్‌లు రైతుల నడ్డివిరిచాయి

5

– గవర్నర్‌ నరసింహన్‌

హైదరాబాద్‌,జులై 19(జనంసాక్షి): మైక్రో ఫైనాన్స్‌ కారణంగా అమాయక రైతుఉల ఎందరో బలయ్యారని గవర్నర్‌ నరసింహన్‌ అన్నారు. అప్పట్టో వీరి చర్యల కారణంగా ప్రభుత్వం కఠినంగా వ్యవహరించిందని అన్నారు.  అమాయక గ్రావిూణ ప్రజలపై వడ్డీ వ్యాపారుల వేధింపులు తగదని గవర్నర్‌ నరసింహన్‌ పేర్కొన్నారు. అసోచామ్‌ ఆధ్వర్యంలో మైక్రో ఫైనాన్స్‌పై నిర్వహించిన సదస్సులో గవర్నర్‌ మాట్లాడారు. మైక్రో ఫైనాన్స్‌ వ్యాపారులు నైతిక విలువలు లేకుండా వ్యాపారం చేశారని తెలిపారు. వాళ్ల వేధింపులు భరించలేక సమైక్య రాష్ట్రంలో అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పారు. సామాన్యుల జీవన స్థితిగతులను మార్చాల్సింది పోయి వడ్డీ వ్యాపారులుగా మారారని పేర్కొన్నారు. గ్రావిూణ ప్రజల్లో ఉన్న నైపుణ్యాన్ని చూసి రుణాలు ఇవ్వండని సూచించారు. దేశ ఆర్థిక పరిస్థితులు మెరుగయ్యేలా చేసే బాధ్యత మైక్రో ఫైనాన్షియర్లపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సమాచారశాఖ కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌ తదితరులు పాల్గొన్నారు.