యం పి యూ పి యస్ కుస్థాపూర్ పాఠశాల లో జాతీయ పతాక వితరణ మరియు ముందస్తు రాఖీ పండుగ సంబరాలు…..

ప్రధానోపాధ్యాయులు
నునావత్ రాజు.
మల్లాపూర్ (జనం సాక్షి )ఆగస్టు :11 మండలంలోని యం పి యూ పి యస్ కుస్థాపూర్ పాఠశాల లో 75 వ స్వాతంత్ర దినోత్సవం- వజ్రత్సవాల్లో భాగం గా గ్రామ సర్పంచ్, పంచాయతీ సెక్రటరీ ఆధ్వర్యంలో జాతీయ పతాకాల వితరణ చేయడం జరిగింది.. దానితో పాటు రాఖీ పండుగ సంబరాలు ఘనంగా జరిగాయి. అన్నా చెల్లెలు, అక్క తమ్ముళ్ల ప్రేమకి, గౌరవానికి ప్రతీక గా జరుపుకునే ఈ పండగను పురస్కరించుకొని… నీవు నాకు రక్షా… నేను నీకు రక్షా… మనిద్దరం దేశానికి రక్షా… అంటూ విద్యార్థులందరు ఒకరికొకరు రాఖీ లు కట్టుకున్నారు… ఇట్టి కార్యక్రమం లో ప్రధానోపాధ్యాయులు నునావత్ రాజు, సర్పంచ్ సరికెలా లక్ష్మీ మహిపాల్, ఉపాధ్యాయులు షహభాజ్ హుస్సేన్, శృతి, గణేష్, సంజన, తదితరులు పాల్గొన్నారు..