యశ్ చోప్రాకి అనారోగ్యం|లీలావతి ఆస్పత్రిలో చేరికి
ముంబాయి: ప్రఖ్యాత బాలీవుడ్ చిత్ర దర్శకుడు యశ్‌చోప్రా అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. అనారోగ్యంతో లీలావతి ఆస్పత్రిలో చేరినట్లు మాత్రమే తెలిసింది కానీ ఆయనకు ఏవిధమైన ఆరోగ్య సమస్యలు తలెత్తాయో కుటుంబ వర్గాలు పేర్కొనలేదు. 80ఏళ్ల యశ్‌చోప్రా గత నెలలోనే రిటైర్మెంట్ ప్రకటించారు. షారుఖ్‌ఖాన్, కత్రినాకైఫ్, అనుష్కశర్మలతో ఆయన తీసిన చివరిచిత్రం ‘జబ్‌తక్ హై జాన్’ నవంబర్ 13న విడుదలకు సిద్దంగా ఉంది. ఐదుదశాబ్దాల కెరీర్‌లో చోప్రా ఎన్మో బాలీవుడ్ చిత్రసీమకు పలు మెగ హిట్లను అందించాడు.