యాదగిరిగుట్టలో భక్తుల తాకిడి
నల్లగొండ,ఫిబ్రవరి16(జనంసాక్షి ): యాదగిరిగుట్టకు శివరాత్రి భక్తుల తాకిడి పెరిగింది. దీంతో కొండపై భక్తుల సందడి నెలకొంది. తెల్లవారుజామున మూడు గంటల నుంచే నిత్య పూజల కోలాహలం మొదలైంది. చలిని సైతం లెక్కచేయకుండా ఆరుబయట భక్తులు అధిక సంఖ్యలో నిద్ర చేశారు. కొండపైన గదులు కూల్చివేసి కొత్తవి నిర్మాణం చేయకపోవడంతో ఆరుబయట నిద్ర చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. తెల్లవారుజామున మూడు గంటల నుంచే నిత్య విధి కైంకర్యాలు మొదలయ్యాయి. 50, 100 రూపాయల క్యూలైన్లు.. ధర్మదర్శనం క్యూలైన్లను తలపించాయి. ధర్మదర్శనానికి ఐదు నుంచి ఆరు గంటల సమయం పట్టినట్లు భక్తులు చెప్పారు. శివాలయంలో భక్తులు అధిక సంఖ్యలో దర్శనం చేసుకున్నారు. కొండపైకి వాహనాలు అనుమతించలేదు. ఏర్పాట్లను ఆలయ ఈఓ గీతారెడ్డి పర్యవేక్షించారు