యాదగిరి గుట్టలో కార్డెన్ సర్చ్
పలువురు వ్యక్తుల అరెస్ట్
యాదాద్రి,మే24(జనం సాక్షి): యాదగిరిగుట్ట అంగడి బజార్ బి సి కాలనిలో పోలీసులు తెల్లవారుజామున కార్డాన్ సెర్చ్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని పలు వాహనాలను సీజ్ చేశారు రాచకొండ కమిషనరేట్ భువనగిరి జోన్ డిసిపి రామచంద్ర రెడ్డి ఆధ్వర్యంలో కార్డన్ సర్చ్ లో మొత్తం 150మంది పోలీసులతో యాదగిరిగుట్ట అంగడి బజార్,బి సి కాలనీ జల్లెడ పట్టారు. పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. సరైన పత్రాలు లేని పలు వాహనాలను 38బైకులు. 1కార్లు. 4ఆటోలు 1 ట్రాక్టర్ సీజ్ చేసి పలు లాడ్జిలాపై సోదాలు చేసి 6 అక్రమజంటలు,ఆరుగురు మంది రౌడీ షీటర్లు, నలుగురు అనుమానితులను, ముగ్గురు లాడ్జ్ యజమానులను, మద్యం అక్రమంగా అమ్ముతున్న వ్యక్తులను, గుట్కా అమ్ముతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనికీలు చేసి పోలీసులు ఇంటిలో ఉన్న పలు వాహనాల రిజిస్టేష్రన్ పత్రాలను పరిశీలించారు. సరైన పత్రాలు చూపకుండా సమాధానం దాటవేసిన వ్యక్తులతో పాటు అనుమానాస్పద వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకున్నారు. కుటుంబంలోఎంత మంది ఉంటారు అని సమాచారాన్ని సేకరించి తమ అధీనంలోకి తీసుకున్నారు. అలాగే ఇటీవల సోషల్ విూడీయాలో వేరే రాష్ట్రల నుండి పిల్లలను ఎత్తుకు పోయే వారు దొంగ తనాలు చేసే వ్యక్తులు వచ్చారన్న వదంతులు నమ్మవద్దని ఎవరినైనా కొంత వ్యక్తులు కనిపిస్తే 100కు డయల్ చేసి లేదా స్థానిక పోలీసులకు తెలియజేయాలని కోరారు.