యాదవ సంఘం ఆధ్వర్యంలో మల్లికార్జున స్వామికి ప్రత్యేక పూజలు
హుస్నాబాద్ రూరల్ ఆగస్టు 21(జనంసాక్షి) హుస్నాబాద్ పట్టణంలోని అరెపల్లి లో యాదవ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం శ్రావణ మాసం సందర్భంగా మల్లికార్జున స్వామి గద్దె కడిగి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లికార్జున స్వామి కరుణాకటాక్షాలు అందరి మీద ఉండాలని అన్నారు. సకాలంలో వర్షాలు పడాలని, పంటలు బాగా పండాలని, రైతన్నలు,దేశ ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని స్వామి వారిని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ మ్యాదరబోయిన వేణు యాదవ్,యాదవ సంగం అధ్యక్షులు గోర్ల కోమురయ్య, గౌరవ అధ్యక్షులు గొర్ల ఆశయ్య ,మాజీ వార్డ్ మెంబర్ కాశబోయిన రవీందర్, గొర్ల హరీష్, ఐలయ్య, కోమురయ్య , సది, రాజయ్య ,లక్ష్మయ్య, తదితరులు పాల్గొన్నారు
