యాదాద్రికి పోటెత్తిన భక్తులు

నల్గొండ, ఆగస్టు 16: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రిలో భక్తుల రద్దీ పెరిగింది. లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఆదివారం కావడంతో భక్తుల తాకిడి మరింత ఎక్కువైంది. స్వామి వారి దర్శనానికి ఐదు గంటల సమయం పడుతుండగా ప్రత్యేక దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది.