యాదాద్రికొండగా యాదగిరి గుట్ట – ముఖ్యమంత్రి కేసీఆర్‌

నల్గొండ, (మార్చి 5): యాదగిరి గుట్ట పేరును ముఖ్యమంత్రి కేసీఆర్‌ యాదాద్రికొండగా మార్చారు. ఈరోజు యాదగరి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న ముఖ్యమంత్రి యాదగిరిగుట్ట పేరును యాదాద్రికొండగా నామకరణం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాదగిరిగుట్టను ఆధ్యాత్మిక కేంద్రంగా మారుస్తామని ప్రకటించారు. ముఖ్యమంత్రి ఈరోజు గుట్ట చుట్టూ మరో 8 గుట్టలను అభివృద్ధి చేస్తామని అన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ నరసింహస్వామి ఆలయాల నమూనాలను యాదగిరిగుట్టలో ప్రతిష్టిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. గుట్టపై ఉన్న ఆరెకరాల్లో కళాఖండాలు, ఆగమశాస్త్ర నియమాల ప్రకారం గుడి, మాడవీధులు, హనుమాన్‌ విగ్రహాన్ని నిర్మిస్తామని ఆయన అన్నారు.