యాదాద్రిని దర్శించుకున్న ఎమ్మెల్యే వివేక్‌

యాదాద్రి భువనగిరి,ఆగస్ట్‌4(జ‌నం సాక్షి ): కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యే వివేక్‌, ఆయన కుటుంబ సభ్యులు.. శనివారం యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహాస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు.. ఎమ్మెల్యే కుటుంబానికి ఆశీర్వచనాలు అందించి.. తీర్థప్రసాదాలు అందజేశారు. వివేక్‌తో ఆయన కుటుంబ సభ్యులు స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఇక్కడ జరుగుతున్న అభివృద్ది పనులను పరిశీలించారు. యాదాద్రి అద్భుతంగా ఉందన్నారు.